Home  »  TV News  »  Ye Devi Varamo Neevu : పెళ్లి రోజు వేడుకల చుట్టూ తిరుగుతున్న కథ.. మనీష్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయా..

Updated : Aug 1, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -23 లో...... అంజలి కుటుంబంతో సహా రాజారావు ఇంటికి వస్తుంది. ఎక్కడ అంజలిని చూస్తుందోనని మనీష్, రాజారావు టెన్షన్ పడుతారు. గీతూ మీరు భోజనం చేసి వెళ్ళండి వంటలు చేయిస్తానని రత్నం అంటుంది. చేయిస్తానని అంటున్నావ్ కొత్త వాళ్ళని పనిలో పెట్టావా అని గీత అడుగుతుంది. అవునని రత్నం చెప్పగానే అయితే కొత్త పనిమనిషి చేత్తో కాఫీ తాగాల్సిందే తీసుకొని రమ్మని చెప్పండి అని భానుచందర్ అంటాడు. దాంతో రత్నం అంజలిని పిలవబోతుంటే మనీష్ అడ్డుపడి నేను చెప్తానని లోపలికి వెళ్తాడు.

అంజలిని కాఫీ పెట్టమని చెప్తాడు. అంజలి తీసుకొని వెళ్తుంటే మనీష్ అడ్డుపడి వద్దు నువ్వు బయటకు రావద్దని మనీష్ కాఫీ తీసుకొని వెళ్తాడు. అందరికి మనీష్ కాఫీ ఇస్తుంటే నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావని గీత అడుగుతుంది. మా అత్తయ్యకి నేనే దగ్గర ఉండి అన్ని పనులు చూసుకోవడం ఇష్టమని మనీష్ కవర్ చేస్తాడు. కాఫీ చాలా బాగుంది ఆ అమ్మాయిని పిల్వండి మెచ్చుకోవాలని భానుచందర్ అంటుంటే అవసరం లేదు ఆ అమ్మాయికి సిగ్గు అని కవర్ చేస్తారు. అయితే మేమే వెళ్తామని భానుచందర్ అనగానే మనీష్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అసలు మేం వచ్చింది ఎందుకు అంటే రెండు రోజుల్లో మా పెళ్లి రోజు ఉంది కదా.. అది ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పడానికి వచ్చామని గీతాంజలి అంటుంది. అందరు వెళ్తే అంజలి ఒక్కతే ఉంటుందని రాజారావు అలోచించి నేను ఈసారి అంత దూరం రాలేనని చెప్తాడు.

దాంతో ఇక్కడే పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ చేసుకుంటామని భాను అనగానే మనీష్, పెద్దాయన షాక్ అవుతారు. అంజలి మీద కోపం తగ్గించడానికి పెద్దాయన ట్రై చేస్తాడు. మొన్న ఏదో గొడవ అయిందట కదా ఆ అమ్మాయిని వదిలేయ్ అమ్మ అని రాజారావు అనగానే అసలు వదలనని గీతాంజలి చాలా కోపంగా మాట్లాడుతుంది. తర్వాత మనీష్ టాపిక్ డైవర్ట్ చేసి మీరు షాపింగ్ కి వెళ్ళాలి కదా వెళ్ళండి అని వాళ్లని పంపిస్తాడు. వాళ్ళు వెళ్తుంటే అంజలి చూస్తుంది. అంజలి చూడడం మనీష్, రాజారావు చూస్తారు. అత్తయ్య అంజలిని చూస్తే ప్రాబ్లమ్ కానీ అంజలి వాళ్లని చూస్తే ఏం ప్రాబ్లమ్ లేదని అనుకుంటారు. తరువాయి భాగంలో అంజలి దగ్గరికి మనీష్ వచ్చి మా అత్తయ్యకి సారీ చెప్పాలి అంటాడు. అసలు నేను చెప్పనని అంజలి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.